భావాల కలబోతే కవిత్వం
కవిత్వానికి మూలం భారం
భారంగా సాగే జీవితమే దుర్భరం
దుర్భారానికి నాందే అబద్ధం
అబద్ధానికి మూలమే అనిశ్చిత
అనిశ్చితంగా సాగే కాలమే జీవితం
జీవితానికి నాందే భావం
భావాల కలబోతే కవిత్వం.
మొత్తం పేజీ వీక్షణలు
14, డిసెంబర్ 2011, బుధవారం
3, నవంబర్ 2011, గురువారం
హిమశిల
ఆర్తిగా హత్తుకొనే మనస్సు
ఒక్కసారిగా నీకు నేను లేను అంటూ గెలిచేస్తే,
ప్రేమకు అర్ధం చెప్పిన ప్రేమత్వం,
ఒక్కసారిగా నీకు నా మీద ప్రేమ లేదంటూ నిలదీస్తే,
దయకు ప్రతిరూపం నా దైవం,
ఒక్కసారిగా నన్ను అనాధగా నిలిపేస్తే,
పరవశించే పరిమళాల పొదరిల్లు,
ఒక్కసారిగా ముళ్ళ కంపై రక్కేస్తే,
గుభేలు మని గుండెబద్ధలై,
వంద సునామీల వరదలా వెల్లువై,
నిలువెల్లా వణికి, నీరల్లా కరిగి,
కాటుక కంటి కొనలనుంచి జారే ప్రతి కన్నీటి బొట్టు
కలచివేసిన కాలరాత్రిలా,
శిలలా మిగిలిన నా ఆత్మ ఘోషించే శబ్ద ఘోష
భూమండల భూ ప్రకంపనలా,
అలుపెరుగని ఆలోచనలు అలసటగా...
నిష్సేబ్దంగా ..నీరవంగా...నిర్లిప్తంగా..నిస్తేజంగా...ఘనీభవించిన హిమశిల కరిగేదేప్పుడో !!!!!!!
23, అక్టోబర్ 2011, ఆదివారం
దీపావళి
దీపావళి దివ్వెల దీపావళి ప్రతి ఇంట్లో దీపావళి
బంతిపూల తోరణాల దీపావళి,
రంగు రంగుల రంగవల్లుల దీపావళి,
మేలిమి బంగారం, పసుపు కుంకుమ తోమాలతో,
లక్ష్మీదేవికి ఆహ్వానం,
కోపాలకు , కక్షలకు విడ్కోలుతో,
ముంగిట వెలుగులతో మనసార అతిధులకు విన్నపం,
ప్రాంతీయ భాషా భేదాలతో సతమతమయ్యే ప్రతి ఒక్కరి పండుగ దీపావళి,
పేర్లు ఎన్నైనా రుచి మాత్రం ఒక్కటే,
రూపాలు వేరైనా వాటి మూలం ఒక్కటే,
నరకాసుర వధ తో ప్రతి ఇంట్లో ఆనందం హరివిల్లు కాగా,
అనుబంధాలు వార్తా హరులై ప్రతి ఒక్కరి మనస్సును రంజింప చేస్తూ,
ఝూం ఝూం డాం డాం అంటూ పటాసులు
కులమత, ప్రాంతీయ భాషా భేదాలను పటాపంచలు చేస్తూ,
పిన్నలకు పెద్దలకు మరపురాని సంతోషాల సంగమం
దీపావళి దివ్వెల దీపావళి ప్రతి ఇంట్లో దీపావళి
18, అక్టోబర్ 2011, మంగళవారం
మలుపు
మలుపు
జీవితంలో ఎన్నో మలుపులు,
మలుపుల్లో ఒక మెరుపు,
మెరుపుల్లో ఒక తలపు,
ఆ తలపుల్లో ఎన్నో జ్ఞాపకాలు,
కెవ్వుమన్న పసిపాప ఏడుపు జీవితపు తొలి మలుపు,
పాకుతూ పడుతూ లేస్తూ నేర్చుకున్న తొలి అడుగు మరో మలుపు,
గురువులు, పూజ్యులు, అమ్మానాన్నల అడుగుజాడల్లో మలుపులు ...
వేస్తాయి బాటసారికి గమ్యం దారులు,
దారెంట నడిస్తే ఎదురయ్యే ఎత్తుపల్లాలు నేర్పిస్తాయి ప్రతి మలుపులో
జీవితపు సారాన్ని,
కష్టజీవికి తప్పదు గెలుపు,
గెలుపే ప్రతి మలుపూ అనుకుంటూ సాగితే.....
ఓటమిలేని ప్రపంచం నీ సొత్తు.
జీవితంలో ఎన్నో మలుపులు,
మలుపుల్లో ఒక మెరుపు,
మెరుపుల్లో ఒక తలపు,
ఆ తలపుల్లో ఎన్నో జ్ఞాపకాలు,
17, అక్టోబర్ 2011, సోమవారం
నా మనస్సు
నా మనస్సు నా మనస్సులో బోలెడన్ని భావాలు, నాగమణి పగడాల
భావాలకు అర్ధాలు వెతుక్కుంటూ....
తెలియని తీరాలు దాటాలనే కోరిక.... కలలు కనే కను రెప్పలను మూయాలని ప్రయత్నిస్తూ ... అలసిపోయిన నా మనస్సు
కోర్కెలకు ఆనకట్టలు ఎల్లలు దాటాకే అనుకుంటూ సుదీర్ఘ ప్రయాణం,
మరపురాని మధురానుభూతులతో నింపుకుంటూ...
నిలువరించలేని మనస్సుకు నిప్పులా ఎగిసిపడే నీరాజనాల హరివిల్లు తోడయ్యి,
పయనించే నౌక ఎన్నిసుడిగుండాలకైన ఎదురొడ్డి..
సంద్రంలో సాగిపోయే కాలంతో ప్రయాణించాలని...
ఎగసిపడే కెరటాల ఆటు పోట్లు భవితం లో తప్పవని తెలిసీ,ప్రయాణపు బడలిక తెలియని ఊపిరితో,
విహంగిలా ఎగిరిపోతూ ,
ఉప్పెనలా ముంచేస్తూ,...కరిగిపోయే కలలను నిశీధి వీధిలో వెతుక్కుంటూ...
గమ్యం కోసం పరుగెడుతూ ,.శరత్కాలపు వెన్నెలకోసం , మల్లెల గుబాళింపు కోసం ఎదురు చూస్తూ ...
అస్తిత్వం లేని అవాస్తవికత కు స్వస్తి చెప్పాలని...
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా అర్ధం లేని జీవితానికి పరమార్ధం తెలపాలని ...
కలల కౌగిలిలో వెచ్చగా నులి వెచ్చగా....
మనస్సును, మనస్సులోని భావాలను పదిలంగా దాచుకుంటూ,,,,,
కడవరకూ సాగాలని - సాగించాలని - కొనసాగించాలని...
విప్పిచెప్పలేని భావాలకు నా మనస్సే సాక్ష్యమని..రంగు రంగుల భావాల కలబోతే నా మనస్సని......
అర్ధం పరమార్ధం అన్నీ బేఖాతారని.......
కవనాల తెలుగుజాతి
కవనాల తెలుగుజాతి
ముక్కు మొఖాలే కాదు తాత ముత్తాతల చిరునామాలతో సహా...
పసిమొగ్గల్నివదలిన తోటకూరతో జత కడితే ....
సామజిక విలువలు వల్లకాటికి పోతున్నాయని గగ్గోలు ఎత్తారు కందుకూరి
సామాజిక విలువల్ని వల్లకాటి నుండి లాక్కువచ్చే ప్రయత్నం లో వచ్చాయి వర విక్రయాలు,
వరకట్నాల రూపంలో.....
ఏమి కోల్పోయాము? ఏమి కోల్పోతున్నాము?
కన్యాశుల్కం, వరకట్నం ఏది కావాలో ఏదీ కాక మరింకేదైనా కావాలో!
వెదుకులాట, పితకలాట
మరో కందుకూరి గగ్గోలెట్టినా, గొంతెత్తి అరచినా ---
వినిపించని లోతుల్లో కూరుకుపోయి,
తాతముత్తాతలు సరే ,, ముక్కు మొఖాలు గుర్తు పట్టలేని అట్టడుగు పొరల్లో,
నాగరికత ముసుగులో కోల్పోయిన సామాజిక విలువలు ,
జీర్ణవ్యవస్థలో మానవతా విలువలు,
అపురూపమైన జ్ఞాపకంగా ఏమీ లేదు...
అన్నీ అతి సామాన్యమే, ఆర్భాటమే .......
భవితకు భావ్యమైన, భవ్యమైన వెలుగులు చూపాలంటే
కన్యాశుల్కం కాదు --- వరకట్నం కాదు
కవనాల తెలుగుదనాన్ని నింపాలి.....
తెలుగు చరిత్రని, సంస్కృతిని వాడనియ్యకుండా, వీడిపోకుండా
భావి జీవితాలకు పదిలంగా అందిద్దాం.., ఆచరిద్దాం.
కవనాల తెలుగుజాతిని నిర్మిద్దాం.
నాగమణి పగడాల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)