క్రొత్త సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి,
అర్ధరాత్రి స్వాతంత్రం తో స్వేచ్చా పాటలు పాడుతూనే ఉంది..
రాజకీయ పార్టీలు పుడుతూనే వున్నాయి,
అహింసా సత్యాగ్రహాల మ్రోత మ్రోగుతూనే ఉంది ..
ఒక్కోరోజు ఒక్కో వార్త ప్రచురితమౌతూనే వున్నాయి,
సమాజపు ప్రక్షాళన జాబితా పెరుగుతూనే ఉంది...
లక్షల కోట్ల గొంతులు అరుస్తూనే వున్నాయి,
పుస్తకాల ఉపన్యాసాల వెల్లువ కొట్టుకు పోతూనే ఉంది ...
చెప్పేది చేసేది కష్టం,
మన సుఖం మనది అనుకోవడం ఇష్టం ..
నేను నాది న్యాయం,
కాదు కూడదంటే అన్యాయం ...
వేలెత్తి చూపడం బాధ్యత,
నిన్ను నువ్వు చూసుకోవడం అసమర్ధత..
వెరపు లేని జీవితం !! వెలితి దాని సంతకం!!
రాముడొస్తాడని రామబాణం వేస్తాడని ..
చీకట్లను చీలుస్తాడని ..
నవమి రోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని ఆకాంక్షిస్తూ ...
శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు !!!