ఆకాశం తాకాలని , మేఘాలతో ఆడాలని ..
చందమామతో కూర్చున్న పేదరాశి పెద్దమ్మ కధలు వినాలని ...
నక్షత్రాల మాలలల్లి కొప్పులో తురమాలని ...
విహంగాల రెక్కలతో భూమ్యాకాశపు అంచులు తాకాలని ..
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం రుచి చూడాలని ...
నెమలి నడకల ఇంద్రధనుస్సు తో నాట్యమాడాలని ...
పూల రంగులతో మదిని నింపాలని ...
సెలయేటి పద ఝరి లో ఆటలాడాలని .. కలలు కనే కళ్ళు ..
నీలోని నీరవాన్ని నిద్ర లేపకపోతే, విశ్వాసాన్ని నింపకపోతే !!!
వాస్తవం లో సాకారం కై ప్రయత్నం లేని కలలు నీకెందుకోయ్ ???
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి