మోయలేము బరువులు దించలేము
వినలేము అడగకుండా ఆగలేము
చూడలేము కళ్ళు మూసి బ్రతకలేము
నడవలేము పరుగెత్తకుండా ఊరుకోము
చేయలేము ఎదుటి వాడిని అభినందించలేము
మాట్లాడలేము స్వసుఖాన్ని వదులుకోలేము
ఎక్కలేము అసూయాద్వేషాల్ని తొక్కలేము
దిగలేము పైపై మెరుగులు చెరపలేము
ప్రతి అడుగూ అడుసే
ప్రతి మునకా మురుగే
నదిలో పారేదెపుడో !!! స్వేచ్చను స్వచ్ఛంగా పొందేదెపుడో ???
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి