ముని మాపు వరకు రాగాలతో కొమ్మ మీది కోయిలమ్మ
మేఘాల మెరుపులతో ధారగా కురిసే వాన చినుకు
గాలి రెప రెపలతో ఆకులు లీలగా తలలు వాల్చే పైరు
విరిసీ విరియని సుమాల నునుసిగ్గులు
చిగురు చిగుళ్లతో బోసి నవ్వుల వసంతం
రాధాకృష్ణుల ప్రేమ సాగర రంగేళి కి
జీవితపు ఇంద్రధనుస్సు రా రమ్మని
పూల రంగుల్లో తడిసి మురిసే పంచమి ఈ వసంత పంచమి జీవితపు ఇంద్రధనుస్సు రా రమ్మని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి