ఎగిరే పక్షి కి తెలుసు తన ఉనికి ఏమిటో !!
పెరిగే మొక్కకి తెలుసు తన బలమేమిటో !!
వీచే గాలికి తెలుసు తన పయనమెటో !!
పారే నీటి కి తెలుసు తన గమ్యమేమిటో !!
జారే వెలుగు కి తెలుసు తన నెలవెక్కడో !!
పూచే పువ్వు కి తెలుసు తన తావు ఏమిటో !!
మూసే చీకటి కి తెలుసు తన స్థాన మేమిటో !!
అన్నీ తెలుసనే మనిషి కి బ్రతుకు భారమెందుకో ???
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి