కౌముది లో ప్రచురితమైన నా కవిత..
మల్లెల సుగంధాలు, జాజుల సౌరభాలు,
సంపెంగల గుభాళింపు చుట్టిముట్టి..
అలుపెరుగని కోర్కెల ఝరి..
ఉవ్వెత్తున ఎగసిపడుతూ,
ఫాల బిందువులు నాసికాగ్రపు ముక్కెరకు మెరుపు నిచ్చి,
జారనీయని ఎద పయ్యెద భారంగా,
ఎదురుచూపులు బాణాల్లా గుచ్చుతుంటే....
వెన్నంటే తలపులు నీ కర స్పర్శకై,
ఎర్రబడిన కనుదోయి నీ మంగళ రూపానికై,
ఆశల అలజడి నీ అడుగుల సవ్వడికై.
ఆత్మీయతా పవనాలు మోసుకొచ్చే నీ పిలుపుకై
నిరీక్షణలో నీ అభిసారిక..
మొత్తం పేజీ వీక్షణలు
1, మార్చి 2012, గురువారం
24, జనవరి 2012, మంగళవారం
నీకెలా చెప్పను
మాననీయమైన మానవతకు,
మహిమాన్వితమైన మాటకు,
నిగ్గు తేల్చే నిజాయితీకి,
నీలాకాశపు నిబద్ధతకు,
అన్నింటికీ మించి బంధాలకు-అనుబంధాలకు,
నీవే పునాది అనుకుంటూ..
సమాజం అంటే నేనే అనుకొనే,
ప్రతి మనీషికి స్ఫూర్తి నీవే అవ్వాలని ..
పరుగులెత్తే నీకు,
ఎండమావుల కోసం అని నీకెలా అర్ధమౌతుంది?
పూచే ప్రతి పువ్వూ రాలేవరకు కొమ్మని వదలి,
దేవుని పూజకు పనికి రాదనీ నీకెలా తెలుస్తుంది?
నీలో నేను నాలో నువ్వు అంటూ..
ఎవరూ లేని ఏకాంతం నిన్ను ఈసడిస్తుంటే..
జయ జయ ధ్వానాలు తప్పించి వినిపించని నీకు,
వేలెత్తి విమర్శించే చేయి చప్పట్లతో కలిశాయని,
నీకెలా తెలుస్తుంది?
అమావాస్య చీకటిలో,
బ్రతుకు బాటని మార్చలేని అయోమయంలో,
దేనికోసం వెతుకుతున్నవో నీకెలా చెప్పను?
మహిమాన్వితమైన మాటకు,
నిగ్గు తేల్చే నిజాయితీకి,
నీలాకాశపు నిబద్ధతకు,
అన్నింటికీ మించి బంధాలకు-అనుబంధాలకు,
నీవే పునాది అనుకుంటూ..
సమాజం అంటే నేనే అనుకొనే,
ప్రతి మనీషికి స్ఫూర్తి నీవే అవ్వాలని ..
పరుగులెత్తే నీకు,
ఎండమావుల కోసం అని నీకెలా అర్ధమౌతుంది?
పూచే ప్రతి పువ్వూ రాలేవరకు కొమ్మని వదలి,
దేవుని పూజకు పనికి రాదనీ నీకెలా తెలుస్తుంది?
నీలో నేను నాలో నువ్వు అంటూ..
ఎవరూ లేని ఏకాంతం నిన్ను ఈసడిస్తుంటే..
జయ జయ ధ్వానాలు తప్పించి వినిపించని నీకు,
వేలెత్తి విమర్శించే చేయి చప్పట్లతో కలిశాయని,
నీకెలా తెలుస్తుంది?
అమావాస్య చీకటిలో,
బ్రతుకు బాటని మార్చలేని అయోమయంలో,
దేనికోసం వెతుకుతున్నవో నీకెలా చెప్పను?
3, జనవరి 2012, మంగళవారం
2011
జారిపోయిన కలలా కరిగిపోయిన కాలం....2011
కాలానికి ఏదీ తీరం ?
తీరం దాటిన కోర్కెలు, ఆశలు....
ఆశల్లో మళ్ళీ చివురించాలని,
చివురించిన ఊహల్లో బ్రతకాలని,
బ్రతికే ప్రతిక్షణం ఫలించాలని,
ఫలించిన జీవితం మీది అవ్వాలని...
మీ అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..
కాలానికి ఏదీ తీరం ?
తీరం దాటిన కోర్కెలు, ఆశలు....
ఆశల్లో మళ్ళీ చివురించాలని,
చివురించిన ఊహల్లో బ్రతకాలని,
బ్రతికే ప్రతిక్షణం ఫలించాలని,
ఫలించిన జీవితం మీది అవ్వాలని...
మీ అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..
1, జనవరి 2012, ఆదివారం
నూతన సంవత్సరం
గడిచిన కాలం ఎప్పుడూ జ్ఞాపకమే
గడుస్తున్న కాలం ఎప్పుడూ ప్రమోదమే
గడపబోయే కాలం ఎల్లప్పుడూ అబ్బురమే
జ్ఞాపకాల , ప్రమోదాల, అబ్బురాల సమ్మేళనమే
ఆశగా ఎదురుచూసే నూతన సంవత్సరం
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గడుస్తున్న కాలం ఎప్పుడూ ప్రమోదమే
గడపబోయే కాలం ఎల్లప్పుడూ అబ్బురమే
జ్ఞాపకాల , ప్రమోదాల, అబ్బురాల సమ్మేళనమే
ఆశగా ఎదురుచూసే నూతన సంవత్సరం
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)