మూసిన వెలసిన మెరిసిన కలవని రంగులు
తెలిసి తెలియని కోరిన కోర్కెల హంగులు
మాటున మేటుగా చాలీ చాలని ఆశలు
చోరుని జారుని జల్లెడ జిల్లనే సాకులు
ఆగని ఆపని వీడని వదలని కర్మలు
మోటుగా ధీటుగా పోటెత్తిన దారుణ శక్తులు
మెండుగా నిండుగా పొగిలే జిత్తుల పొత్తులు
ఎత్తుకు పైఎత్తులు సర్వం స్వాహా కుయుక్తులు
అల్లి బిల్లిగా అల్లిన వెల్లువ జీవనం
రంగుల, హంగుల, ఆశల, సాకులతో ...
శక్తుల, పొత్తుల, కుయుక్తుల జీవనాలు !!!