మొత్తం పేజీ వీక్షణలు

24, జనవరి 2012, మంగళవారం

నీకెలా చెప్పను

మాననీయమైన మానవతకు,
మహిమాన్వితమైన మాటకు,
నిగ్గు తేల్చే నిజాయితీకి,
నీలాకాశపు నిబద్ధతకు,
అన్నింటికీ మించి బంధాలకు-అనుబంధాలకు,
నీవే పునాది అనుకుంటూ..
సమాజం అంటే నేనే అనుకొనే,
ప్రతి మనీషికి స్ఫూర్తి నీవే అవ్వాలని ..
పరుగులెత్తే నీకు,
ఎండమావుల కోసం అని నీకెలా అర్ధమౌతుంది?
పూచే ప్రతి పువ్వూ రాలేవరకు కొమ్మని వదలి,
దేవుని పూజకు పనికి రాదనీ నీకెలా తెలుస్తుంది?
నీలో నేను నాలో నువ్వు అంటూ..
ఎవరూ లేని ఏకాంతం నిన్ను ఈసడిస్తుంటే..
జయ జయ ధ్వానాలు తప్పించి వినిపించని నీకు,
వేలెత్తి విమర్శించే చేయి చప్పట్లతో కలిశాయని,
నీకెలా తెలుస్తుంది?
అమావాస్య చీకటిలో,
బ్రతుకు బాటని మార్చలేని అయోమయంలో,
దేనికోసం వెతుకుతున్నవో నీకెలా చెప్పను?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి