మొత్తం పేజీ వీక్షణలు

17, అక్టోబర్ 2011, సోమవారం

నా మనస్సు

నా మనస్సు
నా మనస్సులో బోలెడన్ని భావాలు,
భావాలకు అర్ధాలు వెతుక్కుంటూ....
తెలియని తీరాలు దాటాలనే కోరిక....
కోర్కెలకు ఆనకట్టలు ఎల్లలు దాటాకే అనుకుంటూ సుదీర్ఘ ప్రయాణం,
మరపురాని మధురానుభూతులతో నింపుకుంటూ...
నిలువరించలేని మనస్సుకు నిప్పులా ఎగిసిపడే నీరాజనాల హరివిల్లు తోడయ్యి,
పయనించే నౌక ఎన్నిసుడిగుండాలకైన ఎదురొడ్డి..
సంద్రంలో సాగిపోయే కాలంతో ప్రయాణించాలని...
ఎగసిపడే కెరటాల ఆటు పోట్లు భవితం లో తప్పవని తెలిసీ,
ప్రయాణపు బడలిక తెలియని ఊపిరితో,
విహంగిలా ఎగిరిపోతూ ,
ఉప్పెనలా ముంచేస్తూ,...
కరిగిపోయే కలలను నిశీధి వీధిలో వెతుక్కుంటూ...
గమ్యం కోసం పరుగెడుతూ ,.
శరత్కాలపు వెన్నెలకోసం , మల్లెల గుబాళింపు కోసం ఎదురు చూస్తూ ...
అస్తిత్వం లేని అవాస్తవికత కు స్వస్తి చెప్పాలని...
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా అర్ధం లేని జీవితానికి పరమార్ధం తెలపాలని ...
కలలు కనే కను రెప్పలను మూయాలని ప్రయత్నిస్తూ ... అలసిపోయిన నా మనస్సు
కలల కౌగిలిలో వెచ్చగా నులి వెచ్చగా....
మనస్సును, మనస్సులోని భావాలను పదిలంగా దాచుకుంటూ,,,,,
కడవరకూ సాగాలని - సాగించాలని - కొనసాగించాలని...
విప్పిచెప్పలేని భావాలకు నా మనస్సే సాక్ష్యమని..
రంగు రంగుల భావాల కలబోతే నా మనస్సని......
అర్ధం పరమార్ధం అన్నీ బేఖాతారని.......

నాగమణి పగడాల

2 కామెంట్‌లు: